Abn logo
Sep 21 2020 @ 13:20PM

హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్: సోనమ్ కపూర్

Kaakateeya

స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కరీనా కపూర్.. ఆ తర్వాత సొంత గుర్తింపు సంపాదించుకుని స్టార్‌గా ఎదిగింది. పదేళ్ల పాటు బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 2012లో హీరో సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్న కరీనా ఈ రోజు (సోమవారం) 40వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 


ఈ నేపథ్యంలో కరీనాకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అనిల్ కపూర్ కూతురు, హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా కరీనాకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేసింది. `డార్లింగ్ బెబో.. నీకు సంతోషకర జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి సూపర్‌స్టార్. త్వరలోనే కలిసి నా ప్రేమతో నిన్ను తడిపేస్తాన`ని సోనమ్ పేర్కొంది. కరోనాతో గతంలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. 



Advertisement
Advertisement
Advertisement