Tokyo Paralympics: నాకౌట్ అవకాశాలను చేజార్జుకున్న సోనాల్‌బెన్ పటేల్

ABN , First Publish Date - 2021-08-27T01:58:49+05:30 IST

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సోనాల్‌బెన్ పటేల్

Tokyo Paralympics: నాకౌట్ అవకాశాలను చేజార్జుకున్న సోనాల్‌బెన్ పటేల్

టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి సోనాల్‌బెన్ పటేల్ మహిళల సింగిల్స్‌లో క్లాస్ 3 నాకౌట్ రౌండ్‌కు చేరే అవకాశాన్ని చేజార్జుకుంది. నేడు (గురువారం) కొరియాకు చెందిన లీ మి-గుయుతో జరిగిన ఫైనల్ గ్రూప్ డి మ్యాచ్‌లో సోనాల్‌బెన్ ఓటమి పాలైంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సోనాల్‌బెన్ పరాజయం పాలవడంతో మహిళల సింగిల్స్ క్లాస్ 3..  3-పెడ్లర్ గ్రూప్ డిలో చివరి స్థానానికి పరిమితమైంది. 


సోనాల్‌బెన్‌కు ఇది తొలి పారాలింపిక్స్.  నిన్న జరిగిన మహిళల క్లాస్‌ 3 కేటగిరి సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌లో సోనాల్‌బెన్ మొదటి మూడు రౌండ్లలోనూ సత్తా చాటినా ఆ తర్వాత చతికిల పడింది. ఫలితంగా 11-9, 3-11, 17-15, 7-11, 4-11తో రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత లి క్వాన్‌ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. కాగా, మహిళల సింగిల్స్ టెన్నిస్ క్లాస్ 4లో భారత క్రీడాకారిణి భావినాబెన్ పటేల్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. గ్రూప్ ఎలో భాగంగా గ్రేట్ బ్రిటన్‌కు చెందిన మేగన్ షకెల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది. 

Updated Date - 2021-08-27T01:58:49+05:30 IST