Abn logo
Nov 25 2020 @ 13:16PM

హైదరాబాద్‌లో `సన్ ఆఫ్ ఇండియా`!

దేశ‌భ‌క్తి  నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మేస్ట్రో ఇళయరాజా సంగీత అందిస్తున్నారు.


ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొద‌ట షెడ్యూల్‌ షూటింగ్ తిరుపతిలో జరిగింది. అక్క‌డ కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారు. తాజా హైదరాబాద్ షెడ్యూల్‌లో ప్రధాన తారగణం అంతా పాల్గొనబోతోంది. మోహ‌న్‌బాబు కోడలు  విరానికా మంచు స్టైలిస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం.

Advertisement
Advertisement
Advertisement