రూ.600 ఇవ్వలేదని తండ్రిపై దాడి.. కర్రతో చితకబాదిన కొడుకు.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-18T20:29:22+05:30 IST

అతను సంపాదన లేకుండా తండ్రి మీద ఆధారపడి బతుకుతున్నాడు.. టీచర్‌గా పనిచేసి రిటైర్ అయిన తండ్రి పాల వ్యాపారం చేస్తూ కొడుకును పోషిస్తున్నాడు.

రూ.600 ఇవ్వలేదని తండ్రిపై దాడి.. కర్రతో చితకబాదిన కొడుకు.. చివరకు ఏమైందంటే..

అతను సంపాదన లేకుండా తండ్రి మీద ఆధారపడి బతుకుతున్నాడు.. టీచర్‌గా పనిచేసి రిటైర్ అయిన తండ్రి పాల వ్యాపారం చేస్తూ కొడుకును పోషిస్తున్నాడు.. ఇటీవల ఆ యువకుడు తన తండ్రిని రూ.600 అడిగాడు.. తన దగ్గర లేవని తండ్రి చెప్పడంతో ఆ యువకుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. కర్రతో తండ్రిని చితకబాదాడు.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆ తండ్రి మరణించాడు.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. 


ఉజ్జయినికి సమీపంలోని వేదనగర్ ప్రాంతంలో మూల్‌చంద్ (73) అనే వ్యక్తి తన కొడుకు అజయ్‌తో కలిసి నివసిస్తున్నాడు. టీచర్‌గా రిటైర్ కావడంతో మూల్‌చంద్‌కు పెన్షన్ వస్తోంది. దానికి తోడు పాల వ్యాపారం కూడా చేస్తూ మూల్‌చంద్ సంపాదిస్తున్నాడు. అజయ్ మాత్రం ఎలాంటి సంపాదనా లేకుండా తండ్రి మీదే ఆధారపడి బతుకుతున్నాడు. బుధవారం రాత్రి తండ్రిని అజయ్ రూ.600 అడిగాడు. మూల్‌చంద్ ఆ డబ్బులు ఇవ్వలేదు. 


డబ్బుల విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ కర్రతో తండ్రిని తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన మూల్‌చంద్‌ను బంధువులు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ అతను గురువారం మధ్యాహ్నం మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-03-18T20:29:22+05:30 IST