
చెన్నై: ఊటీలో భర్తను విడిచిపెట్టిన మహిళ తన వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో ఏడాది వయస్సున్న బిడ్డను చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చింది. ఊటీ వన్నారపేట ప్రాంతంలో నివసిస్తున్న గీత కొన్నేళ్ళ క్రితం మనస్పర్థల కారణంగా భర్తతో తెగతెంపులు చేసుకుంది. ఆమెతోపాటు నితీష్ (3), నితిన్ (1) అనే కుమారులుంటున్నారు. గీతకు పెళ్ళికి ముందే పలువురితో వివాహేతర సంబంధాలుండేవి. భర్తను విడిచిపెట్టడంతో ఆమె తన పాత మిత్రులను ఇంటికి పిలిచి ఉల్లాసంగా గడుపుతుండేది. పెద్ద కుమారుడు నితీష్ స్కూలుకు వెళ్తుండగా చిన్న కుమారుడు మాత్రమే ఇంటిలో ఉండేవాడు. కాగా తన వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్న నితిన్ హతమార్చేందుకు పథకం వేసుకుంది. రోజూ అన్నం పెట్టకుండా బియ్యాన్ని నోటిలో పోసి నీళ్లు తాగించి బలవంతంగా నోటిలో మద్యం పోసి చిలగడ దుంపను నోటీలో కుక్కేది. ఇన్ని చేసినా బాలుడు చావకపోవడంతో చివరకు బుధవారం ఉదయం ఊయల్లో ఉన్న నితిన్ తలను గోడకేసి కొట్టి హతమార్చింది. తన బిడ్డ ఊపిరాడక మృతి చెందాడంటూ ఆమె పెట్టిన కేకలకు చుట్టు పక్కలవారు పరుగెత్తుకొచ్చారు. బిడ్డ తలపై గాయాలుండటంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దింపి విచారించగా అసలువిషయం బయటపడింది. వెంటనే నిందితురాలిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి