Abn logo
Sep 25 2021 @ 19:08PM

కన్నతల్లినే కడతేర్చిన కసాయి

పరిగి: పెన్షన్ డబ్బుల కోసం మద్యం మత్తులో కన్నతల్లినే హత్యచేశాడు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం ఖుదాంద్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రోళ్ళ భీమమ్మ(60)భర్త గతంలోనే మృతిచెందాడు. ఆమె కొడుకు బలవంత్‌ గత కొన్నేళ్ల నుంచి మద్యానికి బానిసగా మారాడు. దీంతో అతడి భార్య రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఏపనీ చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్న బలవంత్‌ డబ్బులు కావాలని తరచూ తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం భీమమ్మకు వచ్చే పింఛన్‌ డబ్బులు రూ.2వేలు రాగా గొడవపడి రూ.వెయ్యి తీసుకున్నాడు. ఆ డబ్బులతో మద్యం తాగిన బలవంత్‌ రాత్రి ఇంటికి వచ్చి మిగతా డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డారు. మద్యం మత్తులో తల్లి మెడకు తీగచుట్టి హత్యచేశాడు. శనివారం ఉదయం ఇంట్లో భీమమ్మ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే బలవంత్‌ తాను చంపలేదని, ఎవరో చంపిఉంటారని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

క్రైమ్ మరిన్ని...