నా కొడుకు మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోండి!

ABN , First Publish Date - 2022-05-21T07:15:50+05:30 IST

ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి సంచలనం రేకెత్తించింది. ఈ యాక్సిడెంట్‌పై పొంతనలేని సమాచారం, గందరగోళం, పలు అనుమానాలతో డ్రైవర్‌ మృతి పెనువివాదంగా మారింది.

నా కొడుకు మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోండి!
జీజీహెచ్‌ పోస్టుమార్టం గది వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరీక్షిస్తున్న టీడీపీ నేతలు చినరాజప్ప, చిక్కాల, కొండబాబు, నవీన్‌..

  • ఎమ్మెల్సీ అనంతబాబుపైనే అనుమానం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి
  • అనుమానాస్పద మృతిగా కేసు

సర్పవరం జంక్షన్‌, మే 20: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి సంచలనం రేకెత్తించింది. ఈ యాక్సిడెంట్‌పై పొంతనలేని సమాచారం, గందరగోళం, పలు అనుమానాలతో డ్రైవర్‌ మృతి పెనువివాదంగా మారింది. యాక్సిడెంట్‌కు గల వివరాలు చెప్పకుండా హడావుడిగా మృతదేహా న్ని కారులోనే వదిలేసి వెళ్లిపోవడంతో డ్రైవర్‌ మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కుమారుడు మృతిపై తల్లి ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘గురువారం అర్థరాత్రి 12.50 గంటలకు ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. మీ అబ్బాయి సుబ్రహ్మణ్యంకు జరిగిన యాక్సిడెంట్‌లో స్పృహ కోల్పోయాడు, విషయం కనుక్కుని చెబుతాను అని ఫోన్‌ పెట్టేశారు. మరలా 1.33 గంటలకు కాల్‌ చేసి భానుగుడి జన్మభూమి పార్కు సమీపంలో అమృత ఆసుపత్రి వద్ద ఉన్నాం, రావాలని కోరగా వెళ్లిచూడగా అక్కడ కారులో స్పృహలేకుండా, గాయాలతో ఉన్న కుమారుడుని డాక్టర్‌ పరీక్షించి మృతి చెందాడని నిర్థారించారు. ఏం జరిగిందని అడిగేలోపే ఎమ్మెల్సీ కారులో మృతదేహంతో పాటూ మమ్మల్ని ఎక్కించుకుని కాకినాడ కుళాయిచెరువు వద్ద దింపేసి వెళ్లిపోయారు. ప్రమాదంపై ఏ విషయం చెప్పలేదు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడిది హత్యా, ప్రమాదమా మృతికి కారణమైన బాఽధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సర్పవరం పోలీ్‌సస్టేషన్‌లో మృతుడు తల్లి వీధి రత్నం ఫిర్యాదు చేసింది. కాకినాడ కొళాయి చెరువు వద్ద ఉంటున్న వీధి రత్నం, సత్యనారాయణలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. ఆమె భర్త స్థానిక అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌. పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం ఉదయభాస్కర్‌ దగ్గర కారు డ్రైవర్‌. మూడు వారాల కిందట బైక్‌పై నుంచి పడడంతో కాళ్లకు దెబ్బలు తగిలి ఇంటి వద్దనే ఉంటున్నాడు. కాగా ఎస్‌ఐ ఎన్‌ సతీ్‌షబాబు కేసు నమో దుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ తెలిపా రు. నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలో గురువారం రాత్రి యాక్సిడెంట్‌ జరిగిందని ఎమ్మెల్సీ చెప్పడంతో మృతుడి తల్లి తొలుత టూటౌన్‌కి వెళ్లిందన్నారు. ఫిర్యాదులో సర్పవరం పోలీ్‌సస్టేషన్‌ అని అడ్రస్‌ చేయడం, నాగమల్లితోట అని చెప్పడంతో అక్కడ పోలీసులు సర్పవరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పగా వెంటనే ఏఎ్‌సఐ భద్రరావు, సిబ్బందిని పంపించి విచారణ చేయగా ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదన్నారు. అనుమానాస్పద కేసుగా ఎస్‌ఐ కేసు నమోదు చేసి టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ చేయడం జరిగిందన్నారు.

 

Updated Date - 2022-05-21T07:15:50+05:30 IST