Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Somu Viraraju: అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది..

twitter-iconwatsapp-iconfb-icon
Somu Viraraju: అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది..

ఎన్టీఆర్ జిల్లా (NTR Dist.): అమరావతిలోనే రాజధాని (AP Capital) కొనసాగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Viraraju) అన్నారు. శుక్రవారం ఆయన నందిగామలో మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా ఉంటామని, అందుకోసమే రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాజధాని ఎవరైతే కట్టుకోలేదో వాళ్లదే పాపమన్నారు.


ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) నగ్న వీడియో (Nude Video) విషయంలో బాగా చర్చ జరుగుతోందని సోము వీర్రాజు అన్నారు. నిజ నిర్ధారణపై గట్టి ప్రయత్నం జరుగుతోందని, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. బీజేపీ కూడా ఢిల్లీలో మహిళా కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చిందన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న విజయవాడలో బహిరంగ సభ జరుగుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోము వీర్రాజు పిలుపిచ్చారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.