పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-06-09T01:13:35+05:30 IST

అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసు శాఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారారని ఆరోపించారు.

పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలు: సోము వీర్రాజు

అమరావతి:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసు శాఖపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం కొమ్ముకాయడం బాధాకరమన్నారు. కోనసీమ ప్రజలు నేడు పోలీసుల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఊపిరి తీసుకునే దౌర్భాగ్య పరిస్థితికి కారకులు ఎవరని ప్రశ్నించారు. అల్లర్లకు ఆజ్యం పోసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే.. అమాయకులు మాత్రం కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోలీసులతో శత్రుత్వం లేదన్నారు. పోలీసులే తమను రెచ్చగొట్టారని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు.  ‘‘పోలీసులు ఆపితే ఆగుతాము. పోలీసు వాహనాలు మోహరించినా ఆగుతాము. ఒక ప్రైవేటు లారీ మా వాహనాలకు అడ్డుగా ఎలా పెడతారు? లారీ డ్రైవర్ తప్పిదం కారణంగా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? 5 ఏళ్ళు అధికారంలో ఉండే వ్యక్తుల కోసం అధికారులు తొత్తులుగా మారొద్దు. ఫలితంగా మీ భవిష్యత్తును ఇబ్బందుల్లో పెట్టుకోవద్దు’’ అని  పోలీసులను ఉద్దేశించి అన్నారు.   

Updated Date - 2022-06-09T01:13:35+05:30 IST