Somu Veerraju: ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

ABN , First Publish Date - 2022-09-21T19:30:28+05:30 IST

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుతో హెల్త్ యూనివర్శిటి ఎమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టడం అంటే ...

Somu Veerraju: ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు మార్పుతో హెల్త్ యూనివర్శిటి ఎమెండ్ మెంట్ బిల్లును ప్రవేశపెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని బీజేపీ (BJP)  తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఒక దురుద్దేశ్యంతో కేవలం ఒక సింగిల్ లైన్‌లో ప్రతిపాదన చేసి శాసన సభలో తీసుకురావడం అంటే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. దొడ్డిదోవన ఎన్టీఆర్‌కు ద్రోహం తెచ్చేవిధంగా వ్యవహరించిందనే  పరిస్థితులు కనపడుతున్నాయన్నారు. 


వైద్య కళాశాలలకు ప్రత్యేకించి ఒక యూనివర్శిటీ తీసుకువచ్చే విధంగా ఎన్టీఆర్ వైద్యకళాశాలలకు యూనివర్శిటీ ఏర్పాటు చేయడం వలన వైద్య కళాశాలలకు పరిపాలన సుగుమం జరిగిందని సోము వీర్రాజు అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్ఆర్ పేరు ఏవిధంగా పెడతారని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్ణయం‌ చాలా దుర్మార్గమన్నారు. వైఎస్ఆర్‌ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే వైసీపీ మాత్రం వైఎస్‌ఆర్ పేరును రాష్ట్రం అంతా పెట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తున్నది కేంద్రమైతే.. మంత్రి అంబటి రాంబాబు అసెంభ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని, రాష్ట్రం ప్రభుత్వం సొంత విషయంగా ఎలా చెబుతారని సోము వీర్రాజు ప్రశ్నించారు.

Updated Date - 2022-09-21T19:30:28+05:30 IST