వర్మ ట్వీట్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-24T22:40:24+05:30 IST

అమరావతి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ట్వీట్‌ను సుమోటొ‌గా తీసుకుని

వర్మ ట్వీట్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

అమరావతి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రపతి ద్రౌపతి అయితే.. కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు?’’ అని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. వర్మ ట్వీట్‌ను సుమోటొ‌గా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మలాగా ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ముందు వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే వర్మను మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2022-06-24T22:40:24+05:30 IST