రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని, జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జనం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. తాగు, సాగునీరు పుష్కలంగా ఉండే ఏలూరు జిల్లాలో ప్రభుత్వ చేతకానితనం వల్ల జనం దాహర్తితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సత్యసాయి తాగునీటి పథకం 2008లో ప్రారంభించారని, ఈ పథకం ద్వారా పోలవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు పరిధిలోని 275 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. అయితే ఈ పథకం 285 రోజులుగా నిలిచిపోయిందని, కనీసం ఎందుకు నిలిపివేశారన్న విషయం కూడా ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదన్నారు. వెంటనే ఈ పథకానికి నిర్వహణ వ్యయం కేటాయించి, తాగునీటిని పంపిణీ చేయాలని జగన్‌ను కోరారు.
ఇవి కూడా చదవండి