Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సోంప్‌ షెర్బత్‌

సోంప్‌ షెర్బత్‌

ఆంధ్రజ్యోతి(18-03-2021)

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, నిమ్మరసం తాగుతాం. ఒంటికి చల్లదనాన్ని అందించే సోంప్‌ షెర్బత్‌  మలినాలను కూడా తొలగిస్తుంది. ఈ స్పెషల్‌ షెర్బత్‌ తయారీని న్యూట్రిషనిస్ట్‌ మున్మున్‌ గనేరివాల్‌ వివరిస్తున్నారిలా...


కావలసినవి: సోంప్‌ గింజలు- పావు కప్పు, నల్లని ఎండుద్రాక్ష - టేబుల్‌స్పూన్‌, వైట్‌రాక్‌ షుగర్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - రెండు కప్పులు, (కావాలనుకుంటే నిమ్మరసం - టేబుల్‌స్పూన్‌). 


తయారీ విధానం: ముందుగా సోంప్‌ గింజలను మెత్తని పొడిలా చేసుకోవాలి. సోంప్‌ పొడిని రెండు లేదా మూడు గంటలు నీటిలో నానబెట్టాలి. నల్ల ఎండుద్రాక్షను విడిగా నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు వైట్‌రాక్‌ షుగర్‌ను మిక్సీలో పొడి చేసుకోవాలి. సోంప్‌ పొడి బాగా నానిన తరువాత నీటిని ఒక పాత్రలోకి వడబోయాలి. నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షను మిక్సీ పట్టి, సోంప్‌ నీళ్లున్న పాత్రలో వేయాలి. ఇప్పుడు చక్కెర పొడి వేసి బాగా కలిపితే టేస్టీ సోంప్‌ షెర్బత్‌ రెడీ. చుక్క నిమ్మరసం కలిపి కూడా తాగొచ్చు.

తాహిని డేట్‌ షేక్‌తాహిని డేట్‌ షేక్‌మొహబ్బత్‌ కా షర్బత్‌మొహబ్బత్‌ కా షర్బత్‌బనానా వాల్‌నట్‌ లస్సీబనానా వాల్‌నట్‌ లస్సీపంజాబీ లస్సీపంజాబీ లస్సీకోకమ్‌ జ్యూస్‌కోకమ్‌ జ్యూస్‌పనసపండు కూల్‌ షేక్‌పనసపండు కూల్‌ షేక్‌జింజర్‌ మింట్‌ లెమనేడ్‌జింజర్‌ మింట్‌ లెమనేడ్‌స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్‌ కూలర్‌స్ట్రాబెర్రీ, వాటర్‌మెలన్‌ కూలర్‌కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్కీర - తులసి మిక్స్‌డ్ డ్రింక్వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌వాటర్‌ మెలన్‌ మాక్‌టైల్‌
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.