అమరావతి: నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కొత్తచరిత్ర సృష్టించిన నాయకుడని, రాజకీయంగా కొత్త తరానికి తెరలేపిన ఆదర్శ నేతని అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడని కొనియాడారు. తన లాంటి వారికి ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.