ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-21T18:39:04+05:30 IST

ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని సోమిరెడ్డి ఆరోపించారు.

ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు: సోమిరెడ్డి

అమరావతి: ఇసుక తవ్వకాల్లో నెలకు రూ. 600 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జేపీ కంపెనీ ఇసుక తవ్వకాలు, సరఫరాపై సమాచార చట్టం ద్వారా లెక్కలు బయటపెట్టారు. రోజుకు 2వేల లారీల అక్రమ ఇసుక రాష్ట్రం నుంచి అనధికారికంగా బయటకు పోతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పాలసీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పారని, ఇప్పుడు రూ. 900కు కూడా అమ్ముతున్నారని విమర్శించారు. డ్రెడ్జింగ్ ద్వారా వచ్చిన రూ. 570 కోట్ల విలువైన ఇసుక.. జేపీ కంపెనీకి ఇవ్వడం ఏంటని సోమిరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-12-21T18:39:04+05:30 IST