సీఎం జగన్‌పై మాజీ మంత్రి కామెంట్స్..

ABN , First Publish Date - 2020-04-10T23:44:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.

సీఎం జగన్‌పై మాజీ మంత్రి కామెంట్స్..

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని కాపాడటమే ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చేసిన నేరమా? అని సోమిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతుంటే సీఎం జగన్‌ ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండటం దురదృష్టకరమని సోమిరెడ్డి అన్నారు.

Updated Date - 2020-04-10T23:44:05+05:30 IST