తిరుమల డిక్లరేషన్ వివాదంపై సోమిరెడ్డి స్పందన

ABN , First Publish Date - 2020-09-21T22:50:42+05:30 IST

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలని..

తిరుమల డిక్లరేషన్ వివాదంపై సోమిరెడ్డి స్పందన

అమరావతి/ తిరుమల : శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా దేవుడిపై నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. తాజాగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లుగా మాట్లాడారు. ఈ వివాదంపై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.


అక్కడికెళ్లి షర్టు ధరిస్తారా..!?

తిరుమలలో ఇతర మతాల వారు డిక్లరేషన్‌లో సంతకం పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. తిరుమల ఒక్క ఏపీకే పరిమితమైన ఆలయం కాదు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలోకి షర్టు ధరించి వెళ్లగలరా?. గురువాయూర్‌లో హిందూయేతరుల్ని అనుమతించరు. మక్కాకి వెళ్లాలంటే ముస్లిం అని డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే. శబరిమల ఆలయంలో మహిళల్ని అనుమతించరుఅని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-09-21T22:50:42+05:30 IST