హైదరాబాద్: కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌ల ద్వారా కొనుగోళ్లు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రులు, అధికారులతో కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించాలని, అధికారులు రోజూ కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర మౌలిక సౌకర్యాలు కల్పించాలని, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని సోమేశ్ కుమార్ సూచించారు.
ఇవి కూడా చదవండి