ఇది దేశంలోనే ఓ ట్రెండ్‌ సెట్టర్‌

ABN , First Publish Date - 2020-10-18T10:03:05+05:30 IST

ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ పోర్టల్‌ దేశంలోనే ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలువనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ .

ఇది దేశంలోనే  ఓ ట్రెండ్‌   సెట్టర్‌

ధరణి వినూత్నం, విప్లవాత్మకం

25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ప్రయోగాత్మకంగా 10 రిజిస్ట్రేషన్లు చేయండి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌


హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘ధరణి’ పోర్టల్‌ దేశంలోనే ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలువనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. పోర్టల్‌ను ఈ నెల 25న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారని తెలిపారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లు, నాయిబ్‌ తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టల్‌ పని చేసే విధానంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ధరణి అందించే సేవలు పారదర్శకంగా, భద్రతతో, పూర్తి రక్షణతో ఉంటాయని, ఏ అధికారికీ విచక్షణాధికారాలు ఉండవని వివరించారు. ఈ పోర్టల్‌ ద్వారా 570 మండలాల్లోని తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా వ్యవసాయ భూములను రిజిస్టర్‌ చేస్తారని తెలిపారు. 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని సబ్‌-రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తులను రిజిస్టర్‌ చేస్తారన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఒక్కో తహసీల్దార్‌ ఆదివారం కనీసం 10 చొప్పున రిజిస్ట్రేషన్లను ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. ఽసేవల్లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా డిస్కంలు, బ్రాండ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు, టీఎ్‌సటీఎస్‌ ప్రతినిధులు, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-10-18T10:03:05+05:30 IST