ఆదిలాబాద్‌టౌన్, ఫిబ్రవరి 26: జిల్లాలో శుక్రవారం కరోనాతో ఒకరు మృతి చెందారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన సింధుబాయి అనే వృద్ధురాలు (85) ఈనెల 24న రిమ్స్‌లో చేరి శుక్రవారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 47కు చేరింది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా 849 మందికి పరీక్షలు చేయగా 14 మందికి పాజిటివ్, 820 నెగెటివ్ కేసులు నమోదయ్యాయని మరో 15 పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.