వింత వ్యాధికి ఒకరు బలి!

ABN , First Publish Date - 2021-01-25T08:46:28+05:30 IST

అంతుచిక్కని వింత వ్యాధి పశ్చిమగోదావరి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూర్చతో ఆదివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.

వింత వ్యాధికి ఒకరు బలి!

దెందులూరు/భీమడోలు, జనవరి 24: అంతుచిక్కని వింత వ్యాధి పశ్చిమగోదావరి జిల్లా వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూర్చతో ఆదివారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో ముగ్గురికి ఈ వ్యాధి సోకింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 69కి చేరింది. దెందులూరు మండలం కొమిరేపల్లికి చెందిన కౌలు రైతు కాలి ఏసుపాదం(65) పశువుల మేత కోసం పొలం వెళ్లాడు. అక్కడ మూర్ఛ రావడంతో కొట్టుకులాడుతూ పక్కనే ఉన్న పంట కాలువలో పడి చనిపోయాడు. ఏసుపాదం మృతి వార్తతో గ్రామస్థుల్లో భయాందోళన పెరిగింది. ఇదే గ్రామంలో ఆదివారం మరో మహిళ కళ్లు తిరిగి పడిపోగా కొమిరేపల్లి ప్రభుత్వ వైద్య శిబిరానికి తరలించారు. కాగా.. భీమడోలు మండలం భీమడోలు, పూళ్ల గ్రామాల్లో మరో ఇద్దరు మూర్చ వచ్చి పడిపోయారు.

Updated Date - 2021-01-25T08:46:28+05:30 IST