హైదరాబాద్‌లో రూ.75 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. రాత్రికి రాత్రే కబ్జాకు యత్నం..

ABN , First Publish Date - 2020-07-11T15:54:16+05:30 IST

ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తుంటే మరోవైపు అవి కబ్జాకు గురవుతున్నాయి. శేరిలింగంపల్లి మండల

హైదరాబాద్‌లో రూ.75 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి.. రాత్రికి రాత్రే కబ్జాకు యత్నం..

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం.. రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం


మాదాపూర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తుంటే మరోవైపు అవి కబ్జాకు గురవుతున్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్‌ గురుకుల్‌ ఘట్కేసర్‌ ట్రస్టు స్థలాల్లోని ఆక్రమణల కూల్చివేతలు కొద్దిరోజులుగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కబ్జాదారులు రాత్రికి రాత్రే సుమారు రూ.75కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నంచారు. ఖానామెట్‌లోని సర్వేనెంబర్‌ 11/1లో 7 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. స్థలాన్ని కాజేసేందుకు రాత్రికిరాత్రే గదులతో పాటు షెడ్లు నిర్మించారు. స్థానికుల సమాచారం మేరకు ఎక్స్‌కవేటర్‌తో ఆషెడ్లు, గదులను ఆర్‌ఐ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేశారు. 

Updated Date - 2020-07-11T15:54:16+05:30 IST