పారిచెర్లగుట్ట మాయం..?.. పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

ABN , First Publish Date - 2020-08-03T19:18:37+05:30 IST

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేసేస్తున్నారు. గద్వాల జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ మోకాపై సగం భూమి కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పారిచెర్లగుట్ట మాయం..?.. పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం

భారీ వాహనాలతో ఆక్రమణకు శ్రీకారం చుట్టిన ముగ్గురు పట్టాదారులు

 ఇప్పటికే నాలుగు ఎకరాల భూమి చదును చేసినట్లు గ్రామస్థుల ఆరోపణలు


గద్వాల (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేసేస్తున్నారు. గద్వాల జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ మోకాపై సగం భూమి కూడా లేదనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ యం త్రాంగం లీలలతో ప్రభుత్వ భూములన్ని పరుల పాలయ్యాయి. ధరూర్‌ మండలం పారిచెర్ల గ్రామంలో బండరాళ్లగట్టు(చిన్న గుట్ట) ఉంది. ఈ గుట్ట చుట్టు ఉ న్న ముగ్గురు పట్టాదారులు మూడు రోజులుగా భారీ వాహనాలతో బండరాళ్లను తొలగిస్తు భూమిని చదు ను చేసుకుంటున్నారు. 


ఈ విషయంపై స్థానికులు కొందరు ఫొటోలు, వీడియోలు తీసి రెవెన్యూ యం త్రాంగానికి పంపించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’కి పంపించారు. ప్రభుత్వ భూమిని కాజేస్తున్న పట్టాదారులపై చర్యలు జరగాలంటూ లేఖ కూడా పంపించారు. కాగా, ఈ విషయమై గట్టు తహసీల్దార్‌ రాజుకు ఫోన్‌ చేస్తే సెల్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంది.

Updated Date - 2020-08-03T19:18:37+05:30 IST