Fight for Study: అన్నా.. నేను చదువుకోకూడదట.. ఊళ్లో వాళ్లు బెదిరిస్తున్నారంటూ చెప్పిన 16 ఏళ్ల దళిత బాలిక.. చివరకు..

ABN , First Publish Date - 2022-07-26T21:16:18+05:30 IST

ఒకవైపు బేటీ బచావో, బేటీ పఢావో అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగుతున్నాయి.

Fight for Study: అన్నా.. నేను చదువుకోకూడదట.. ఊళ్లో వాళ్లు బెదిరిస్తున్నారంటూ చెప్పిన 16 ఏళ్ల దళిత బాలిక.. చివరకు..

ఒకవైపు బేటీ బచావో, బేటీ పఢావో అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగుతున్నాయి. మరోవైపు, మహిళల ఎదుగుదలను అడ్డుకునే కార్యక్రమాలు కూడా అక్కడక్కడా జరగుతున్నాయి. మధ్యప్రదేశ్‌(Madhya pradesh) లోని షాజాపూర్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వెళ్లకూడదంటూ దళిత కులానికి చెందిన మైనర్ బాలికను కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే ఆ బాలిక వారి దుర్మార్గానికి ఎదురు తిరిగింది. దీంతో ఆ గ్రామంలో ఈ విషయంపై కొట్లాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇది కూడా చదవండి..

Paramjeet Singh: నాకే ఎందుకీ కష్టాలని బాధపడేవాళ్లు తప్పక చదవండి.. సరిగ్గా 38 ఏళ్ల క్రితం ఈయన లైఫ్ ఎలా ఉండేదంటే..


షాజాపూర్ జిల్లా బవలియాఖేడి గ్రామానికి చెందిన 16 ఏళ్ల లక్ష్మి మేవార్ అనే దళిత బాలిక స్కూల్‌ నుంచి వస్తుండగా గ్రామానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. గ్రామంలోని అమ్మాయిలెవరూ చదువుకోకూడదని హుకుం జారీ చేశారు. ఆ బాలిక, ఆమె అన్నయ్య వారికి ఎదురు తిరిగారు. ఈ విషయంపై ఇరువర్గాలు ముఖాముఖి తలపడ్డాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో బాలిక కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడగా, వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. బాధిత బాలిక నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-07-26T21:16:18+05:30 IST