త్వరలో ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులు: యూఏఈ రాయబారి

ABN , First Publish Date - 2020-07-10T06:04:20+05:30 IST

యూఏఈలో చెల్లబాటు అయ్యే రెసిడెన్సీ వీసా లేదా వర్క్ పర్మిట్ కలిగి ఉండి, కరోనా కారణంగా ఇండియాలో చిక్కుకున్న వారికి భారత్‌లోని యూఏఈ రాయబారి అ

త్వరలో ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులు: యూఏఈ రాయబారి

న్యూఢిల్లీ: యూఏఈలో చెల్లబాటు అయ్యే రెసిడెన్సీ వీసా లేదా వర్క్ పర్మిట్ కలిగి ఉండి, కరోనా కారణంగా ఇండియాలో చిక్కుకున్న వారికి భారత్‌లోని యూఏఈ రాయబారి అహ్మద్ అల్ బన్నా శుభవార్త తెలిపారు. ఇండియా నుంచి యూఏఈకి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని విజృంభిస్తున్న నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఇందులో భాగంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించింది. దీంతో యూఏఈలో రెసిడెన్సీ వీసా లేదా వర్క్ పర్మిట్ కలిగి ఉన్న లక్షలాదిమంది భారతీయులు ఇండియాలో చిక్కుకున్నారు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. ఇక్కడ చిక్కుకున్న వారిని ఉద్దేశించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఇండియాలో చిక్కుకున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి యూఏఈకి విమాన సర్వీస్‌లు అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు ఇండియాలోని యూఏఈ రాయబారి అహ్మద్ అల్ బన్నా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2020-07-10T06:04:20+05:30 IST