Abn logo
Apr 10 2021 @ 23:32PM

పర్యాటకం..పరిహాసం!

 కంపచెట్ల మఽఽధ్య పైలాన్లు

 ఊసేలేని రిసార్ట్స్‌, బోటు షికార్‌

సోమశిల జలాశయ ప్రాంత అభివృద్ధిలో తిరోగమనం

దృష్టి సారించని పాలకులు

అనంతసాగరం, ఏప్రిల్‌ 10: సోమశి ల జలాశయం మన ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. జిల్లా సాగునీటి రంగంతో పాటు చిత్తూరు, చెన్నై నగరాల తాగునీటికి దోహద పడుతుంది ఈ జలాశయం. అయితే ప్రభుత్వాలు మారుతున్నా సోమశిల మాత్రం అభివృద్ధి తిరోగమనంలో ఉంది. పర్యాటక పరంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలే దు. సోమశిల జలాశయానికి 1975లో అప్ప టి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేశారు. అప్పటి నీరుపారుదల శాఖ మంత్రి ఆనం వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు సరదాగా పెన్నానదిలో బోటు షికారు చేశారు. పచ్చటి కొండ ల మధ్యలో పెన్నానది పరవళ్లు చూసిన జలగం మంత్ర ముగ్ధులైనట్లు ప్రస్తుత విశ్రాంత ఉద్యోగులు చెబుతుంటారు. అప్పట్లోనే సోమశిలలో బోటు షికారుకు బీజం పడినా ఆ దిశగా నేటికి అమలు చర్యలు కనిపించలేదు. జలాశయం ఒక నీటి వనరుగానే పాలకులు చూస్తుండం గమనార్హం.

ముళ్లపొదల నడుమ పైలాన్లు

1975లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేసిన పైలాన్‌ నేడు శిథిలావస్ధకు చేరుకుంది. క్రస్ట్‌గేట్‌ స్థాయిలో నిలిచిన పనులను పూర్తిచేసి 1988లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మిగిలిన పనులు పూర్తి చేసి సోమశిల జలాశయాన్ని జాతికి అంకి తం చేస్తున్నట్లు ప్రకటించి పైలాన్‌ ప్రారంభించారు. అప్పటినుంచి సోమశిల జలాశ యం నీటి సరఫరా వ్యవస్థ వినియోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతులమీదుగా ప్రారంభమైన పైలాన్‌ పిచ్చి మొక్కల నడు మ ఉంది. ఇక 2013లో ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మెట్టప్రాంతాలకు సోమశిల జలాలు తరలించే హైలెవల్‌ కెనాల్‌కు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. నేడు ఆ పైలాన్‌ చుట్టూ ముళ్లపొదలు విస్తరించి శిలాఫలకం కనిపించిన పరిస్థితి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అధికారుల నిరాదరణకు గురైన విలువైన ఈ చిహ్నాలు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. సోమశిల చెంతనే సుమారు రూ.2 కోట్లతో 2013లో నిర్మించిన పర్యాటక అభివృద్ధి పనులు నేడు పర్యవేక్షణ చేసే దిక్కులేక కునారిల్లుతున్నాయి. పర్యాటక శాఖ పర్యవేక్షణ లేక కట్టడాలు(డార్మెంటరి, పర్ణశాలలు) నిరుపయోగంగా ఉన్నాయి. 

ఊసేలేని రిసార్ట్స్‌, బోటు షికారు 

సోమశిల జలాశయం వద్ద రిసార్ట్స్‌, బోటు షికారు ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణం తెచ్చేలా గతంలో చేపట్టిన ప్రతిపాదనలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా పర్యాటక పరంగా అభివృద్ధి చర్యలు కనిపించడం లేదు. దీంతో సోమశిలకు వచ్చే పర్యాటకులు ఇటు వసతులు, అటు ఆహ్లాదకర వాతావర ణం లేక నిరాశకు గురవుతున్నారు. 

పర్యాటకం మా పరిధిలోకి రాదు 

సోమశిల జలాశయం వద్ద పర్యాటక అభివృద్ధి మా పరిధిలో లేదు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పనులు అభివృద్ధి చేయా లి. పర్యాటక పనులకు సంబంధించిన సమాచారం మాకు లేదు.

- సురే్‌షబాబు, ఇన్‌చార్జి ఈఈ, సోమశిల


Advertisement
Advertisement
Advertisement