మొగడిశు: సొమాలియాలో జరిగిన బాంబు దాడిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మహిళా ఎంపీ సహా 48 మంది మృతి చెందారు. సొమాలియా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బెలిడిన్లో ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎంపీ అమీనా మహ్మద్ అబ్ది ప్రయాణిస్తున్న కారును వెంబడించిన నిందితుడు.. వెళ్లి ఆమెను కౌగిళించుకున్నాడు. అనంతరం బాంబు పేలిందని స్థానిక పోలీసు చీఫ్ కోల్ ఇసాక్ అబ్దుల్లే తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ దాడికి పాల్పడ్డది తామేనని అల్-శబాబ్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, బుధవారం దీనికి ముందు మరో బాంబు దాడి జరిగింది. రాజధాని మొగడిశులోని అడెన్ అడ్డే ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు మరణించారు. ఈ దాడి కూడా తమపనేనని అల్-శబాబ్ ప్రకటించింది. కాగా, ఎంపీ అబ్ది ప్రజా నాయకురాలిగా పేరొందారు. ధైర్యశాలని అంటుంటారు. ఆమె ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తుంటారు. గత జూన్‌లో మహిళా ఇంటలీజెన్స్ అధికారి తాహ్లిల్ ఫరాహ్ మిస్సైంది. అయితే అప్పటి నుంచి ఆమె ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అందుకే ఆమెను పార్లమెంట్‌కు రాకుండా అడ్డుకునేందుకు అధికారులు కుట్రపన్నారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
తాహ్లిల్ కేసుకు అంతరాయం కలిగించేందుకే అబ్దిని హత్య చేశారని సొమాలియా ప్రధానమంత్రి మహ్మద్ హుస్సేన్ రాబ్లే అన్నారు. తహ్లిల్ మిస్సింగ్ అంశమై సెప్టెంబర్‌లో ఇంటలీజెన్స్ అధికారి నిశాను తొలగించారు. ఇక అబ్ది మృతిపై సొమాలియా ఎంపీలు విచారం వ్యక్తం చేశారు. ‘‘ఒక గొప్ప నాయకులు, సామాజికవేత్త, నిర్భయ లాయర్‌ను సొమాలియా కోల్పోయింది. ఇక్రాన్ తహ్లిల్కు న్యాయం చేసేందుకు పోరాడిన ఆమె ఈ విధంగా మూల్యం చెల్లించుకుంది. సొమాలియాను నూతన పురోగతి వైపుకు తీసుకెళ్లే దిశగా ఆమెతో మంగళవారం చర్చించాను. ఒక రోజులోనే ఇలా జరగడం దారుణం’’ అని ఎంపీ అబ్దిరిజాక్ మహ్మద్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి