Abn logo
Aug 7 2020 @ 06:07AM

‘దళితులపై పెరుగుతున్న దాడులు’

రాజమహేంద్రవరం సిటీ 6: దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతు న్నాయని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సోమాబత్తుల విజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక గోకవరం బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం నిరసన నిర్వహించారు. 29ఏళ్ల క్రితం చుండూరు ఘటన మొద లుకొని సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన శిరోముండనం వరకు చూస్తే అరాచకశక్తులు, అగ్రవర్ణాలు ఏదోక మూలన దళితులపై దాడులు కొనిసాగి స్తూనే ఉన్నాయని, ఈ దాడులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా చుండూరు ఘటనలో అసువులు బాసిన దళితులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో గుర్రం అనిల్‌ కుమార్‌, డి.కామేశ్వరరావు, రాజా, శ్యాంప్రసాద్‌, వీరాంజనేయులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement