పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-15T05:16:54+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలకు పోరాటాల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులే సు తెలిపారు.

పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న ఓబులేసు

కడప(సెవెన్‌రోడ్స్‌), ఆగస్టు 14: కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలకు పోరాటాల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులే సు తెలిపారు. కడప నగర సమితి 6వ మహాసభ లు ఆదివారం హోచిమెన్‌ భవన్‌లో నగర కార్యవ ర్గ సభ్యులు మనోహర్‌రెడ్డి, కేసీ బాదుల్లా అధ్యక్షతన నిర్వహించిన మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో రెండో సారీ మోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికల వాగ్గానాలకు తిలోదకాలిచ్చి నిరంకుశ ఫాసిస్టు చర్యలను ముమ్మరం చేసిందన్నారు.

నల్లధనం వెలికితీత, ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పన, ప్రజ లపై పన్ను భారం తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ప్ర పంచలోనే అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొడుతోందన్నారు. సాగు చట్టాల పేరుతో ఇటు రైతులను అటు వినియోగదారులను నిలువునా దోపిడీ చేసేందుకు కార్పొరేట్‌ కంపెనీలతో చేసుకు న్న చీకటి ఒప్పందాలను ఢిల్లీ రైతాంగ పోరాటం బద్దలు కొ ట్టి సాగు చట్టాలను రద్దు చేయించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏ ఒక్కటీ వదలకుండా ఒకటొకటి గా తెగనమ్ముతూ చివరకు 32 మంది విద్యార్థుల ఆత్మబలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేటుపరం చేయడాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారన్నారు. నిత్యావసరాలు, పెట్రో ధరలను అమాంతం పెంచి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సందర్భగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగిన పోలవరానికి నిధులు కేటాయించడంలో, కడప సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ వాగ్దానాలు అమలు చేయడం లో ఘోరమైన నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

సీపీఐ జిల్లా కార్యద ర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో శ్యాండ్‌, మైన్‌, వైన్‌ మాఫియా ప్రజలను దోచుకుంటుంటే విద్యుత్‌ చార్జీలు, ఆర్టీ సీ చార్జీలు, ఇంటి, నీటి, చెత్త పన్ను పెంచి ముక్కుపిండి వ సూలు చేసిన డబ్బును నగదు బదిలీ పథకాల పేరుతో ప్రజలను మఽభ్యపెడుతూ ఇచ్చేది గోరంత తీసుకునేది కొండంత అనే చందంగా పాలిస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు ఒక్కటేనంటూ వితండవాదం చేస్తూ పారిశ్రామికరంగాన్ని, నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.నాగసుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం, రమణ, విజయలక్ష్మి, ఎర్రముక్కపల్లి జోన్‌ కార్యదర్శి జి.వేణుగోపాల్‌, తాలూక జోన్‌ క్యాదర్శి సావంత్‌ సుధాకర్‌, సెంట్రల్‌ కార్యదర్శి మద్దిలేటి, చిన్నచౌక్‌ కార్యదర్శి ఓబయ్య, కార్యవర్గ సభ్యులు నాగరాజు, భీమరాజు, చిన్నప్ప, లింగన్న, నాగిరెడ్డి, ఆర్‌.బాబు, శంకర్‌నాయక్‌, సుబ్బరాయుడు, గౌస్‌, ఈశ్వయ్య, భాగ్యలక్ష్మి, ఏఐఎ్‌సఎఫ్‌ గంగాసురేష్‌, వలరాజు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:16:54+05:30 IST