హైటెన్షన్‌ తీగల సమస్యను పరిష్కరించా!

ABN , First Publish Date - 2022-09-27T06:05:43+05:30 IST

ఒంగోలు నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న హైటెన్షన్‌ తీగల సమస్యను పరిష్కరించినట్టు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

హైటెన్షన్‌ తీగల సమస్యను పరిష్కరించా!
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న బాలినేని

మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 26: ఒంగోలు నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న హైటెన్షన్‌ తీగల సమస్యను పరిష్కరించినట్టు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం 35వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  వైసీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన వెంటనే హైటెన్షన్‌ తీగలను మార్పు చేసేందుకు ప్రభు త్వం రూ 50 కోట్లు కేటాయించడంతో వెంటనే ఆ పనులను పూర్తిచేసి నట్టు చెప్పారు. గడిచిన 30 ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్యను తన హ యాంలో పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి ఒక వైపు అభివృద్ధి పనులు చేస్తూ ఇంకోవైపు సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పలురకాల సమస్యలను బాలినేని దృష్టికి తీసుకురావడంతో, వెంటనే నగర పాలక సంస్థ అఽధికారులకు ఆయా సమస్యలను పరిష్కరించేలా చర్యలు  తీసుకోవాలని ఆదేశించారు. 

కార్యక్రమంలో మేయర్‌ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఆ వార్డు కార్పొరేటర్‌ శాండిల్య, వైసీపీ నాయకులు ఓగిరాల వెంకట్రావు,  ఘనశ్యాం, కటారి శంకర్‌, తూము పద్మ, సువర్ణ, కొలా ప్రభాకర్‌, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉప్పుగుండూరు శ్రీనివాసులు తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T06:05:43+05:30 IST