పీఆర్సీలో వీఆర్‌ఏలకు వేతనంపై జేఏసీ ప్రస్తావించాలి
నరసన్నపేట, జనవరి 23: గ్రామాల్లో సేవలను అందించే వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ నాయకులు కోరారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో వీఆర్‌ఏల సం ఘం జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో వీఆర్‌ఏలను రెగ్యులర్ చేస్తామని, రూ.21 వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా నేటి వరకు అమలు చేయలేదన్నారు. నామినీలను వీఆర్‌ఏగా కొనసాగించాలని, పనిచేస్తూ మర ణించిన వారి కుటుంబాల్లోని ఒకరికి కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంఘాల నాయ కులు వీఆర్‌ఏల సమస్యలను ప్రస్తావించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు తేజేశ్వర రావు, వీఆర్‌ఏల సంఘం కార్యదర్శి వై.అప్పలస్వామి, రాష్ట్ర కార్యదర్శి అప్పలనాయుడు, గవరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా అల్లు సత్య నారాయణ, అధ్యక్షుడిగా బుర్ర సూర్యనారాయణ (సరుబుజ్జిలి), ప్రధాన కార్యదర్శిగా తండ్యాల త్రినాథరావు (పొందూరు) ఉపాధ్యక్షు లుగా నేతల సీతప్పుడు, బొంతు ఆనందరావు, ఎం.మల్లేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా బి.మిన్నారావు, కె.సత్యనారాయణ, రమణ మూర్తి, జి.రాజ్‌కుమార్ తదితరులను ఎన్నుకున్నారు.