విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

మండలంలోని సండ్రావారిపల్లె, మునేళ్ళపల్లె గ్రామస్థులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ (ఆర్‌ఈసీ) సీవీ నాగార్జునరెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించండి
ఆర్‌ఈసీ చైర్మన్‌ నాగార్జునరెడ్డికి సమస్యలు వివరిస్తున్న గ్రామస్థులు

ఆర్‌ఈసీ చైర్మన్‌ నాగార్జునరెడ్డి ఆదేశం


కలికిరి, మే 22: మండలంలోని సండ్రావారిపల్లె, మునేళ్ళపల్లె గ్రామస్థులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ (ఆర్‌ఈసీ) సీవీ నాగార్జునరెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కేవీపల్లె, కలికిరి మండలంలోని కొన్ని గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా సండ్రావారిపల్లె సర్పంచు జహీదా, ప్రేమనాథరెడ్డి తదితర గ్రామస్థులతో కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను నాగార్జునరెడ్డి దృష్టికి తెచ్చారు. సండ్రావారిపల్లె, మునేళ్ళపల్లె గ్రామాల్లోని కొన్ని ప్రాంతాలకు కేవీపల్లె మండలంలోని గ్యారంపల్లె సబ్‌స్టేషన్‌ నుంచి, మరికొన్ని ప్రాంతాలకు కలికిరి మండలంలోని పాళెం సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోందని వివరించారు. అయితే విద్యుత్‌ సరఫరాలో సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారానికి సాంకేతిక పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎవరు బాధ్యత తీసుకోవాలన్న విషయంలో గందరగోళం ఏర్పడుతోందని చెప్పారు. ఈ రెండు పంచాయతీలకు రెండు మూడేళ్ళుగా లైన్‌మన్లు లేకపోవడం కూడా రైతులకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. గ్రామస్థులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీలేరు ఈఈ సురే్‌షను ఆయన ఆదేశించారు. కలికిరి సింగిల్‌ విండో అధ్యక్షుడు నల్లారి శ్రీకర్‌ రెడ్డి, పలువురు విద్యుత్‌ శాఖాధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం ఆయన కేవీ పల్లె మండల పర్యటనకు వెళ్లారు.

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST