అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2020-08-08T08:20:55+05:30 IST

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం ..

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించండి

 సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా


అనంతపురం వైద్యం, ఆగస్టు 7: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. శారదా నగర్‌లోని అనంతపురం అర్బన్‌ సీడీపీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ నేత ఓబులు నేతృత్వంలో నిరసన కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న కాలంలో కూడా అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. వారికి సంక్షే మ పథకాలు వర్తింపజేయకపోవటం దారుణమన్నారు. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలను ప్రీస్కూల్స్‌గా నిర్వహించి కేంద్రాల అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నక్షత్ర, ఈశ్వరమ్మ, సునీత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.


మన్నీలలో..

అనంతపురం రూరల్‌: కేంద్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి డిమాండ్‌ చేశారు. మండలంలోని మన్నీల గ్రామ సచివాలయం ఎదుట వర్కర్లు ధర్నా చేపట్టారు. అంగన్‌వాడీలకు 18 నెలలుగా సెంటర్‌ అద్దెలు చెల్లించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీస్కూల్‌ యాక్టివిటీని ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. తక్షణం దానిని విరమించుకోవాలన్నారు. ఆశావర్కర్లకు జనవరి నుంచి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అలవెన్స్‌ రూ.1000 కూడా ఇవ్వలేదన్నారు. తమ సమస్యలు పరిష్కరిం చాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, వర్కర్లు సుమలత, యామిని, లక్ష్మీదేవి, నాగమణి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T08:20:55+05:30 IST