Abn logo
Sep 24 2021 @ 23:41PM

అంగనవాడీల సమస్యలు పరిష్కరించండి

హిందూపురం టౌన, సెప్టెంబరు 24: అంగనవాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్కీమ్‌వర్కర్స్‌ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హిందూపురంలో కూడా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగనవాడీ కార్యకర్తలు సమ్మెను నిర్వహించారు. ఇందిరా పార్కు నుంచి అంబేడ్కర్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగనవాడీ కార్యకర్తలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ. 5 లక్షలు కల్పించి, పది వేలు పెన్షన అందజేయాలన్నారు. కనీస వేతనం రూ.21 వేలు అందించాలన్నారు. వీరికి సంక్షేమ పథకాలు అమలుచేయాలని, కోవిడ్‌ డ్యూటి చేస్తున్న వారికి అదనంగా రూ. 10 వేలు రిస్క్‌ అలెవెన్స ఇవ్వాలన్నారు. ఆశాలకు పెండింగ్‌ బిల్లులు చెల్లించి వేతనాలు ఇవ్వాలన్నారు. కోవిడ్‌ విధుల్లో చనిపోయిన వారికి రూ. 50 లక్షల భీమా ఇవ్వాలన్నారు. కేంద్ర తీసుకువచ్చిన కార్మిక కోడ్‌ బిల్లు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, అత్తర్‌బాబా, రామాంజి, అంగనవాడీ కార్యకర్తల సంఘం నాయకురాళ్లు శీరీష, వరలక్ష్మి, విజయలక్ష్మి, భారతి, శైలజ, ఇందిరాదేవి, పద్మావతి తదితరలు పాల్గొన్నారు.