కరోనాకు పరిష్కారాలు చెబితే స్కాలర్‌షిప్‌లు

ABN , First Publish Date - 2020-04-04T10:15:53+05:30 IST

కరోనా సమస్యలకు పరిష్కారం చెప్పే మెదళ్లను ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దుబాయ్‌(ఐసీడీ) తో కలిసి సోషల్‌ ఇంపాక్ట్‌ ఇన్నొవేషన్‌ ప్లాట్‌ఫామ్‌ గ్లోబల్‌ గ్రాడ్‌ షో ఆహ్వానిస్తోంది.

కరోనాకు పరిష్కారాలు చెబితే స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కరోనా సమస్యలకు పరిష్కారం చెప్పే మెదళ్లను ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దుబాయ్‌(ఐసీడీ) తో కలిసి సోషల్‌ ఇంపాక్ట్‌ ఇన్నొవేషన్‌ ప్లాట్‌ఫామ్‌ గ్లోబల్‌ గ్రాడ్‌ షో ఆహ్వానిస్తోంది. ఏఆర్‌ఎం హోల్డింగ్‌, దుబాయ్‌ కల్చర్‌ మద్దతు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ వార్షిక కార్యక్రమానికి భిన్నంగా కొవిడ్‌-19 కోసమే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. భారత్‌ సహా పలు దేశాల గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌, ప్రొఫెసర్లను ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్‌ 16న ఎంపికైన ప్రాజెక్టును ప్రకటిస్తామని, వాటి రూపకర్తలకు స్కాలర్‌షి్‌పలను అందజేస్తామని గ్లోబల్‌ గ్రాడ్‌ షో క్యురేషన్‌ చీఫ్‌ బ్రెండన్‌ తెలిపారు.

Updated Date - 2020-04-04T10:15:53+05:30 IST