Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొట్ట బరువుగా, గ్యాస్ట్రిక్‌ సమస్య ఉన్నట్టుగా అనిపిస్తే..

ఆంధ్రజ్యోతి(22-02-2020)

ప్రశ్న:  నా వయసు 52 సంవత్సరాలు. ఈమధ్య మధుమేహం వచ్చింది. టాబ్లెట్స్‌ వాడుతున్నా. ఆహార విషయంలో జాగ్రత్తగానే ఉంటా. కానీ ఈమధ్య సాయంత్రం అయ్యేప్పటికీ పొట్ట బరువుగా, గ్యాస్ట్రిక్‌ సమస్య ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇది మధుమేహం వల్ల వచ్చే సమస్యనా, లేదా ఆహార మార్పులు ఏమైనా చేయాలా?


-మనోహరి, కాకినాడ


డాక్టర్ సమాధానం : పొట్ట ఉబ్బరం, బరువుగా ఉండటం, గ్యాస్‌తో ఇబ్బంది... ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లమేషన్‌ లక్షణాలు. సాధారణంగా మధుమేహం, బీపీ ఉన్నవారికి ఇలా అనిపించొచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, ప్రాసెస్‌ చేసిన ఆహారం అతిగా తినడం, అతిగా మందులు వాడటం, మత్తుమందులు, మద్యపానం, పొగత్రాగడం, నిద్రలేమి మొదలైనవి నిత్యం ఇన్‌ఫ్లమేషన్‌కు గురి చేస్తూ ఉంటాయి. సో... ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే...


ఆకుకూరలు ప్రతిరోజూ వాడటం. 

బాదం పప్పు ప్రతిరోజూ 10 తీసుకోవడం. 

పంచదార, స్వీట్స్‌ వెంటనే మానేయడం.

పండ్లు అధికంగా తీసుకోవడం. వారానికి రెండుసార్లు చేపలు తినడం. చేపలు తిననివారు వాల్‌నట్స్‌, ఆల్మండ్స్‌ క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ప్రతిరోజూ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం.

రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. అది కూడా సమయానికి నిద్రపోవడం ముఖ్యం.

మజ్జిగ, పెరుగు, ప్రొ బయాటిక్‌ సప్లిమెంట్‌ వాడటం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరిగి, పొట్ట ఉబ్బడం తగ్గుతుంది. ఈవిధంగా లైఫ్‌స్టయిల్‌లో, ఆహార నియమాల్లో మార్పులు చేస్తే శరీరం తేలికగా ఉంటుంది.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

[email protected] 
Advertisement
Advertisement