కొత్త ఆప్షన్‌ల ద్వారా సమస్యలకు పరిష్కారం

ABN , First Publish Date - 2022-05-21T05:33:16+05:30 IST

ధరణిలో కొత్త మాడ్యుల్‌ ప్రారంభమై మరో ఎనిమిది కొత్త ఆప్షన్‌ల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు.

కొత్త ఆప్షన్‌ల ద్వారా సమస్యలకు పరిష్కారం


ఆదిలాబాద్‌టౌన్‌,మే20: ధరణిలో కొత్త మాడ్యుల్‌ ప్రారంభమై మరో ఎనిమిది కొత్త ఆప్షన్‌ల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ తెలిపారు. గురువారం రాత్రి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, ధరణి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణిలో కొత్త మాడ్యుల్‌ వచ్చిందని, ఈ మాడ్యుల్‌ ద్వారా పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, భూమి పందిన రకం మార్పు, పరిధి దిద్దుబాటు, మిస్సింగ్‌ సర్వే/ సబ్‌ డివిజన్‌ నెంబర్‌, నోషనల్‌ ఖాతా (అన్ని రకాలు) నుంచి పట్టాకు భూమి బదిలీ చేయడం, భూమిరకం మార్పు వంటి సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. భూముల యజమానులు ఈ సమస్యల పరిష్కారానికి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్‌.నటరాజ్‌, రిజ్వాన్‌భాషాసేక్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, తహసీల్దార్లు, ధరణి పర్యవేక్షకురాలు స్వాతి,ధరణి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T05:33:16+05:30 IST