ఐకమత్యంతో సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-03-01T06:41:41+05:30 IST

టైలర్లు ఐక్యమత్యంగా ఉంటే సమస్యలను పరిష్కారించుకునే అవకాశం ఉందని టైలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పసుపుల.ప్రభాకర్‌, మండల అధ్యక్షుడు సాల్మన్‌ పేర్కొన్నారు.

ఐకమత్యంతో సమస్యల పరిష్కారం
విలియమ్‌హోవే చిత్రపటంకు నివాళులర్పిస్తున్న టైలర్లు

దొనకొండ, ఫిబ్రవరి 28 : టైలర్లు ఐక్యమత్యంగా ఉంటే సమస్యలను పరిష్కారించుకునే అవకాశం ఉందని టైలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పసుపుల.ప్రభాకర్‌, మండల అధ్యక్షుడు సాల్మన్‌ పేర్కొన్నారు. దొనకొండ మెయిన్‌ బజార్‌లో టైలర్స్‌ దినోత్సవం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్‌ సృష్టికర్త విలియమ్‌ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం రెడిమేడ్‌ కాలంలో టైలర్ల జీవనం దుర్భరంగా మారిందన్నారు. ప్రభుత్వం తగిన సహకారం అందించి ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్లు నరసింహారావు, కర్నా.హనుమయ్య, నున్నా బాలు, నున్నా శ్రీను, బొర్రయ్య, టైలర్లు పాల్గొన్నారు.

లింగసముద్రం : కుట్టుమిషను సృష్టికర్త విలియమ్స్‌ హోవే 211వ  జయంతి సందర్బంగా లింగసముద్రంలో ఆదివారం టైలర్ల సంఘం గౌరవ అధ్యక్షులు కేవీ రత్నం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీ రత్నం టైలర్ల జెండాను ఎగురవేశారు. టైలర్లు కేవీ రత్నంను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం  వైసీపీ మండల కన్వీనర్‌ పి.తిరుపతిరెడ్డి కేక్‌ కట్‌ చేసి పంచారు. కార్యక్రమంలో టైలర్ల సంఘం అధ్యక్షులు జి గంగిరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ టి ఆంజనేయులు, కార్యదర్శి వెంకట్రావు, కె రమణయ్య, బి.శ్రీను, కేవీ.కొండయ్య, పి.సూరిబాబు పాల్గొన్నారు.

ముండ్లమూరు, ఫిబ్రవరి 28 : మండల కేంద్రం ముండ్లమూరు బస్టాండ్‌ కూడలిలో మండల టైలర్స్‌ సంఘం ఆధ్వర్యంలో  విలయం  హోవే జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టైలర్స్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి కత్తి నాగేశ్వరరావు,  కార్యదర్శి ఎస్‌కే మస్తాన్‌, అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు కంభంపాటి ప్రకాశరావు, కార్యదర్శి గోపనబోయిన నాగరాజు, సుజాత, సుశీలమ్మ, మరియమ్మ, ఏలిసమ్మ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. 

దర్శి : దర్శి పట్టణంలో టైలర్స్‌డే వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్ధానిక టైలర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏపీటీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కత్తి.నాగేశ్వరరావు, దర్శి పట్టణ టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలి, తదితరులు విలియమ్స్‌హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలుర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్టు మిషన్‌ వలన ప్రజలు సాంప్రదాయబద్దంగా బట్టలు వేసుకునే అవకాశం కల్పించిన మహనీయుడని కొనియాడారు. టైలర్ల సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని టైలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:41:41+05:30 IST