చెమటకాయలు రాకుండా..!

ABN , First Publish Date - 2021-04-29T05:30:00+05:30 IST

వేసవిలో ఇబ్బంది పెట్టే సమస్య చెమటకాయలు. సాధారణంగా ఉక్కిరిబిక్కిరి చేసే వేడి వాతావరణం వల్ల ఇవి వస్తాయి. ఈ సమస్య తలెత్తకుండా ఉండడానికి నిపుణులు చేస్తున్న సూచనలివి...

చెమటకాయలు రాకుండా..!

వేసవిలో ఇబ్బంది పెట్టే సమస్య చెమటకాయలు. సాధారణంగా ఉక్కిరిబిక్కిరి చేసే వేడి వాతావరణం వల్ల ఇవి వస్తాయి. ఈ సమస్య తలెత్తకుండా ఉండడానికి నిపుణులు చేస్తున్న సూచనలివి... 


  1. మీ శరీరానికి గాలి తగిలేలా తేలికగా, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వేసవిలో  ముదురు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. 
  2. విపరీతమైన వేడి, వడగాలుల వల్ల శరీరం తొందరగా డీహైడ్రేట్‌ అవుతుంది. ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడాలంటే... మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్ల వంటి సహజసిద్ధమైన ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. 
  3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వేసవిలో చాలా ముఖ్యం. పండ్లు, సలాడ్స్‌ వంటివి ఎక్కువగా తీసుకొంటే శరీరం చల్లబడుతుంది. వేపుళ్లు, స్వీట్లు, అలాగే శరీరంలో వేడిని పెంచే మసాలాలు తగ్గించడం మేలు. 
  4. చర్మాన్ని పొడిగా ఉంచడానికి ప్రయత్నించండి. స్నానం చేసిన వెంటనే శుభ్రంగా తుడుచుకొంటే బాక్టీరియా చేరదు. ప్రింక్లీ హీట్‌ పౌడర్‌ వాడడం వల్ల చెమటకాయలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Updated Date - 2021-04-29T05:30:00+05:30 IST