ఏకాంతంగా అష్టోత్తర శత కలశాభిషేకం

ABN , First Publish Date - 2021-05-13T04:46:24+05:30 IST

పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం కొండపై లక్ష్మీ చెన్నకేశవస్వామికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆలయ అర్చకులు సుమన్‌ దీక్షితులు ఏకాంతంగా నిర్వహించారు.

ఏకాంతంగా అష్టోత్తర శత కలశాభిషేకం
శేషవాహనంపై దర్శనమిచ్చిన చెన్నకేశవుడు

శేషవాహనంపై చెన్నకేశవుడు

పురుషాన్‌ మృగవాహనంపై వైద్యనాథేశ్వరుడు

వల్లూరు, మే 12: పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం కొండపై లక్ష్మీ చెన్నకేశవస్వామికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆలయ అర్చకులు సుమన్‌ దీక్షితులు ఏకాంతంగా నిర్వహించారు. ముందుగా అష్టోత్తర కలశాలను నక్షత్ర ఆకారంలో ఉంచి అందులో పంచమ నదుల్లోని నీటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన నీటిని, జాపత్రి, సెంటు, పన్నీర్‌, గంధం, పసుపు కుంకుమలతో వివిధ ద్రవ్యాలను అందులో పోసి శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిరాట్‌ను సుందరంగా అలంకరించారు. దిగువన కొలువై ఉన్న కామాక్షి సమేత వైద్యనాథేశ్వరునికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి దేవీ ఖడ్గమాలతో పాటు కుంకుమార్చనలను నిర్వహించి సుందరంగా అలంకరించారు. వేద పారాయణాలను, రుద్ర హోమాలను ఆలయ పండితులు ఏకాంతంగా నిర్వహించారు. సాయంత్రం వివిధ పూజా హోమాలనంతరం శేషవాహనంపై చెన్నకేశవుని, పురుషాన్‌ మృగవాహనంపై వైద్యనాథేశ్వరున్ని సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీసూక్త, పురుష సూక్త విధానాలతో స్వామి వారికి పూజలు, తదుపరి మహా మంగళహారతి, మంత్రపుష్పాన్ని నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో భాగంగా అర్చకులు మాత్రమే ఈ పూజ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహించారు.



Updated Date - 2021-05-13T04:46:24+05:30 IST