చంద్రబాబు దీక్షకు సంఘీభావం

ABN , First Publish Date - 2021-10-23T05:47:36+05:30 IST

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపేందుకు నంద్యాల నుంచి నాయకులు తరలివెళ్లారు.

చంద్రబాబు దీక్షకు సంఘీభావం
దీక్షకు సంఘీభావం తెలుపుతున్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్‌ రామ్‌నాయుడు

నంద్యాల, అక్టోబరు 22: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపేందుకు నంద్యాల నుంచి నాయకులు తరలివెళ్లారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌, తెలుగురైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుంటుపల్లి హరిబాబుతోపాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. 


సంఘీభావం తెలిపిన భూమా జగత్‌

ఆళ్లగడ్డ: మంగళగిరిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపినట్లు టీడీపీ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌నాయుడు శుక్రవారం తెలిపారు. ఆళ్లగడ్డ నుంచి 30 వాహనాల్లో కార్యకర్తలతో తరలివెళ్లిన వీరు మాజీ సీఎంను కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. జగత్‌ విఖ్యాత్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పె రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.


రుద్రవరం: చంద్రబాబు దీక్షకు మద్దతుగా ఆళ్లగడ్డ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాతరెడ్డి ఆధ్వర్యంలో రుద్రవరం మం డలం నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకు తమ మద్దతు తెలిపారు. టీడీపీ నాయకులు రంగనాయకులు,  మం డల కార్యదర్శి శ్రీనివాసులు, రామసుబ్బారెడ్డి, చిన్నికృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2021-10-23T05:47:36+05:30 IST