సంఘీభావ దీక్షలు

ABN , First Publish Date - 2021-10-23T06:13:34+05:30 IST

టీడీపీ జాతీయ కార్యాలయంతో పా టు నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు నిరసిస్తూ ఆ పార్టీ అధి నేత నారాచంద్రబాబునాయుడు 36గంటల పాటు చేపట్టిన దీక్షకు తెలుగుతమ్ముళ్లు సంఘీభావం తెలిపారు.

సంఘీభావ దీక్షలు
సీకేపల్లిలో దీక్ష చేస్తున్న టీఎనఎస్‌ఎఫ్‌, తెలుగుయువత, తెలుగు మహిళ సభ్యులు

చెన్నేకొత్తపల్లి, అక్టోబరు 22: టీడీపీ జాతీయ కార్యాలయంతో పా టు నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు నిరసిస్తూ ఆ పార్టీ అధి నేత నారాచంద్రబాబునాయుడు 36గంటల పాటు చేపట్టిన దీక్షకు తెలుగుతమ్ముళ్లు సంఘీభావం తెలిపారు. టీఎనఎస్‌ఎఫ్‌, తెలుగు యువత, తెలుగుమహిళాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో సంఘీభావ దీక్ష చేపట్టారు. తెలుగుమహిళా ఉపాధ్యక్షురాలు రామసుబ్బమ్మ, స్వర్ణ, రాములమ్మ, అస్మతబీ, విజయ, టీఎనఎస్‌ఎఫ్‌ ఉపాఽధ్యక్షుడు బండారు భార్గవ, నరేంద్రరెడ్డి, నాగార్జున తదితరులు దీక్షలో పాల్గొన్నారు. వారికి రామగిరి మాజీ ఎంపీపీ రంగయ్య, తెలుగుయువత జిల్లా ప్రధానకార్యదర్శి గంగుల కుంట రమణ, టీడీపీ ఉపాధ్యక్షుడు జాఫర్‌ఖాన, టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, రాష్ట్ర తెలుగు మహిళా కార్యని ర్వాహక అధ్యక్షురాలు లక్ష్మీదేవి తదితరులు మద్దతు పలికారు. వైసీ పీ శ్రేణుల ఆగడాలకు వ్యతిరేకంగా నినాదాలుచేశారు. రాష్ట్రంలో రా క్షసపాలన సాగుతోందని, ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి వారు చే స్తున్న ఆగడాలను ఖండిస్తున్న వారిపై దాడులకు దిగడం సిగ్గుచే టన్నారు. ఈ దుర్మార్గపు పాలనను ప్రజలు గమనిస్తున్నారని,  తగిన సమయంలో తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. ఈ దీక్షల్లో టీ డీపీ నాయకులు గేటు కిష్టప్ప, శ్రీరాములు, అంకే అమరేంద్ర, న్యామ ద్దల కిష్టప్ప, సూరి, అహమ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

శింగనమల : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా... ఆ పార్టీ నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటి మడుగు కేశవరెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మండల నాయకుడు దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో   తెలుగు యువత నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. మండలకేం ద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్షలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి ఎం ఆదినారాయణ మాట్లాడుతూ... టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని ప్ర భుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దనా గముని, అట్టె శ్రీనివాసులు, నారాయణ, మెండెం ఎర్రిస్వామి, సుంకన్న, విజయ్‌, ఆకులేడు పవన, దండు ప్రకాష్‌, మహమ్మద్‌ గౌస్‌, రమణ, మునీశ్వర్‌, గోగుల ఆది, తలారీ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-23T06:13:34+05:30 IST