Abn logo
Sep 18 2021 @ 00:56AM

కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు ఘన స్వాగతం

దీన్‌దయాల్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి స్వాగతం పలుకుతున్న వినయ్‌రెడ్డి

ఆర్మూర్‌రూరల్‌, సెప్టెంబరు17: ఆర్మూర్‌ శివారులో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు బీజేపీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం వారు నిర్మల్‌లో అమిత్‌షా సభకు వెళ్తూ చేపూర్‌లోని క్షత్రీయ ఇంజనీరింగ్‌ కళాశాలలో కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా పండిత్‌ దీన్‌దయాల్‌ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అ ల్పాహారం చేసి వారు నిర్మల్‌కు బయలుదేరారు. అనంతరం వినయ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పార్టీ ప్రముఖులకు స్వాగతం పలికినవారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్‌ శ్రీనివాస్‌, బద్దం లింగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, పుప్పాల శివరాజ్‌ కుమార్‌లు తదితరులు ఉన్నారు.