బడుగుల దేవుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2020-05-29T11:31:41+05:30 IST

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి వారి జీవితాల్లో వెలుగులు నింపి

బడుగుల దేవుడు ఎన్టీఆర్‌

జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల ఘన నివాళులు


కడప, మే 28 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి వారి జీవితాల్లో వెలుగులు నింపి బడుగుల అన్నగా నిలిచిపోయారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. 97వ జయంతిని జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.  రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడపలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి, కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, పీరయ్య, నగర అధ్యక్షుడు జిలానీబాష, ప్రధాన కార్యదర్శి వికా్‌స హరిక్రిష్ణ, క్రిష్ణమూర్తి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. టీడీపీ దళిత నేత, మాజీ జీపీ గుర్రప్ప కార్యాలయంలో దళిత నేతలు ఎంపీ సురేష్‌, ఆమూరి బాలదాసు, చైతన్య తదితరులు నివాళులర్పించారు. కొండాయపల్లెలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు చలపతినాయుడు తదితరులు నివాళులర్పించారు.


రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు పిలుపు మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, పట్టణ, గ్రామీణ మండల పార్టీ అధ్యక్షుడు సంజీవరావు, సుబ్రమణ్యంనాయుడులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ బంధువులు పేద బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు అందించారు. రైల్వేకోడూరులో కస్తూరి విశ్వనాధనాయుడు కేక్‌ కట్‌ చేసి నివాళులర్పించారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ముక్తియార్‌, సుధాకర్‌రెడ్డిలు బద్వేలులో డాక్టర్‌ రాజశేఖర్‌, ఖాజీపేటలో రెడ్యం వెంకటసుబ్బారెడ్డి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడడమే కాకుండా వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. తెలుగు జాతి కీర్తిని నలుదిక్కులా చాటారన్నారు.

Updated Date - 2020-05-29T11:31:41+05:30 IST