గడ్డెన్నకు ఘన నివాళులు

ABN , First Publish Date - 2021-04-21T06:24:42+05:30 IST

స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గడ్డెన్న కాక వర్ధంతిని ముథోల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

గడ్డెన్నకు ఘన నివాళులు
దేగాం గ్రామంలో గల గడ్డెన్న విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు

భైంసా, ఏప్రిల్‌ 20 : స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గడ్డెన్న కాక వర్ధంతిని ముథోల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని  పురస్కరించుకోని భైంసా మండలంలోని దేగాం గ్రామంలో గల గడ్డెన్న కాకా విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన నాయకులు మాట్లాడుతూ ముథోల్‌ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి గడ్డెన్న కాకా అనిర్వచనీయమైన సేవలను అందించారని కొనియడారు.

Updated Date - 2021-04-21T06:24:42+05:30 IST