కాగజ్‌నగర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు
ఆసిఫాబాద్, జనవరి 18: ఆసిఫాబాద్ పట్టణంలో మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీనాయకులు ఆయన చిత్రప టానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మారాం, తాజ్‌బాబా, సాయిరాం, దౌలత్‌కుమార్, శ్రీనివాస్, రవి, శంకర్, మహేష్, ప్రవీణ్, బాబు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: పట్టణంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ గుళ్లపల్లి ఆనంద్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మరాం, సురేష్ కుమార్, యలమంచలి శ్రీనివాస్, గుళ్లపల్లి లావణ్య, సౌభగ్య లక్ష్మి, శంకర్, ఎల్.మఽధుకర్, సంతోష్, మాధవి, దౌలత్‌రావు, గులాబ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.