Abn logo
May 8 2021 @ 00:00AM

ఘనసర చేరిన ఏనుగులు

భామిని: ఏనుగుల గుంపు మళ్లీ ఘనసర చేరింది. కొద్దిరోజుల కిందట ఘనసర, కోసలి, తాలాడ గ్రామస్థులు  గుంపును తరలించిన విషయం విదితమే.  పదిరోజులపాటు సీతంపేట మండలంలోని బగ్గా మర్రిపాడులో సంచరించాయి.  భామిని మండలంలోని ఘనసర, కోసలిలో రెండు నెలలుగా   తిష్ఠవేసిన ఏనుగులు శనివారం వేకుజామున మళ్లీ ప్రవేశిం చాయి. ఘనసర సమీపంలో కిల్లారి పున్నగిరి సేకరించిన జొన్నపొట్ట గింజలను  ధ్వంసం చేశాయి.  సుమారు రూ.40 వేలు వరకు నష్టపోయినట్లు ఆయన  వాపోయాడు.ఈ ప్రాం తంలోని తోటల్లో ఏనుగులకు అనుకూలంగా ఉండడంతో మళ్లీ ఇక్కడే తిష్ఠ వేస్తాయని గ్రామస్థులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.