ఆడుకున్న భారత్, అమెరికా సైనికులు

ABN , First Publish Date - 2021-10-18T21:02:25+05:30 IST

ఒళ్లు జలదరించే సైనిక విన్యాసాల మధ్య ఒకింత ఆట విడుపు ఉంటే ఆ రూటే వేరు. ఇందుకు ప్రతీకగా ...

ఆడుకున్న భారత్, అమెరికా సైనికులు

అలస్కా: ఒళ్లు జలదరించే సైనిక విన్యాసాల మధ్య ఒకింత ఆట విడుపు ఉంటే ఆ రూటే వేరు. ఇందుకు ప్రతీకగా భారత్, అమెరికా సైనికులు ఓపైపు సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొంటూనే, మరొక వైపు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. కబడ్డీ ఆటలో తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తూ, ఫుట్‌బాల్, వాలీబాల్ మ్యాచ్‌లు ఆడుతూ అలస్కాలో సందడి చేస్తున్నారు.


ఇండియా, అమెరికా మధ్య ద్వైపాక్షిక సైనిక సహకారం మరింత పెంచుకునేందుకు 15 రోజుల సైనిక విన్యాసాలు అలస్కాలో జరుగుతున్నాయి. ఇరు దైశాల మధ్య 17వ విడత సైనిక విన్యాసాలు అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మాండార్ఫ్ రిచర్డ్‌సన్ వద్ద ఈనెల 15న ప్రారంభమయ్యాయి. 29వ తేదీతో ముగియనున్నాయి. ఇండియన్ బ్యాచ్‌లో ఆర్మీకి చెందిన 350 మంది ఇన్‌ఫాంట్రీ సోల్జర్స్ పాల్గొంటున్నారు. దీనికి ముందు గత ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య సైనిక విన్యాసాలు బికనెర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగాయి.


కాగా, అలస్కాలో జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసాల నడుమ, ఇండియన్ ఆర్మీ కంటిజెంట్, యూఎస్ కంటింజెంట్ మధ్య కబడ్డీ 'ఫ్రెండ్లీ మ్యాచ్‌లు' కూడా జరుగుతున్నాయి. ఫుట్‌బాల్, వాలీబాల్ మ్యాచ్‌లలోనూ ఉత్సాహంగా ఇరు జట్లు పాల్గొంటున్నాయి. ఇరుదేశాల మధ్య సైనిక సహకారం పెంచుకోవడం కోసం ఈ సైనిక విన్యాసాలు ఉద్దేశించామని, తద్వారా ఇరు దేశాల సైనికుల మధ్య అవగాహన, సహకారం మరింత పెరుగుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-10-18T21:02:25+05:30 IST