Abn logo
Jul 16 2020 @ 00:26AM

ఫ్రేయర్‌ సౌర విద్యుత్‌ యాప్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సౌర విద్యుదుత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి కోసం హైదరాబాద్‌కు  చెందిన ఫ్రేయర్‌ ఎనర్జీ ‘సన్‌ప్రో’ పేరుతో మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. గృహ యజమానులు, వ్యాపార సంస్థలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమకు అవసరమైన సౌర విద్యుత్‌ ప్లానింగ్‌ గురించి తెలుసుకోవడంతోపాటు నిర్మాణానికి ఆర్డర్‌ చేయొచ్చని ఫ్రేయర్‌ ఎనర్జీ ఎండీ సౌరభ్‌ మర్దా తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ దశను, పూర్తయిన తర్వాత పనితీరును కూడా ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ఆధారంగా ఆయా వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా యాప్‌ సమాచారం అందిస్తుంది. 


Advertisement
Advertisement
Advertisement