మట్టి కొట్టేస్తున్నారు..

ABN , First Publish Date - 2021-08-04T04:50:56+05:30 IST

మండలంలో పోలవరం కుడి కాలువ గట్టు వద్ద మట్టి తవ్వేస్తున్నారు.

మట్టి కొట్టేస్తున్నారు..
పోలవరం కుడి కాల్వ గట్టు వద్ద మట్టి తవ్విన ప్రదేశం

ద్వారకాతిరుమల, ఆగస్టు 3: మండలంలో పోలవరం కుడి కాలువ గట్టు వద్ద మట్టి తవ్వేస్తున్నారు. పలువురు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా మట్టి తవ్వి అక్రమం గా తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. గుండంపల్లి, తక్కిళ్లపాడు గ్రామాల మధ్య పోలవరం, కుడి కాలువ మట్టిని యంత్రాలతో లారీలపై తరలించేస్తున్నారు. మట్టి రవాణాలో సైతం నిబంధనలు అతిక్రమిస్తున్నా పట్టించుకునే వారే లేరు. మండలంలో చెరువులు, కాలువల వెంబడి మట్టిని కూడా తవ్వేస్తున్నారు. కుడికాలువకు సంబంధించిన అధికారులకు ఫోన్‌ ద్వారా సంప్రదించినా స్పందించలేదు.

Updated Date - 2021-08-04T04:50:56+05:30 IST